![]() |
![]() |
.webp)
"మన రూపం చూడకముందే, మన గొంతు వినకముందే, మనల్ని మనలా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ" అలాంటి మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇక ఫామిలీ స్టార్స్ షో ఈ వారం మదర్స్ డే స్పెషల్ ఈవెంట్ తో రాబోతోంది. ఈ షోకి మానస్, రాకేష్, విశ్వా ఇంకా మిగతా బుల్లితెర నటులు అంతా వాళ్ళ వాళ్ళ మదర్స్ తో వచ్చారు. హోస్ట్ సుధీర్ మానస్ వాళ్ళ అమ్మను ఒక ప్రశ్న అడిగాడు "మానస్ ఇంట్లో ఎలా ఉంటాడండి" అని అడిగేసరికి "చిన్న డ్రాయర్ తో చిన్న బనీన్ తో అలా కనిపిస్తూ ఉంటాడు" అని చెప్పేసరికి మానస్ ఊరుకోమ్మా ఇంట్లో విషయాలన్నీ స్టేజి మీద పరువు పోయేలా చెప్తావేంటి అన్నట్టు పెట్టాడు ఫేస్. తర్వాత రాకేష్ దగ్గరకు వచ్చి చిన్నప్పటినుంచి ఇలాగే ఉండేవాడా అని వాళ్ళ అమ్మను అడిగితే "చిన్నప్పుడు అంటే ఒకటి గుర్తొచ్చింది..చిన్నప్పుడు ఉంగా ఉంగా అనేవాడు" అని చెప్పేసరికి సుధీర్ షాకయ్యాడు.
ఇంకా ఏమందంటే "మా అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి ఉంది అనేసరికి" సుధీర్ "ఛీఛీ నాకొద్దు" అన్నాడు. "ఆమె కూడా అదే అంది" అంటూ రాకేష్ వాళ్ళ అమ్మ కామెడీ చేసింది. ఇక విశ్వా వాళ్ళ అమ్మ విశ్వతో కలిసి పోటాపోటీగా డాన్స్ చేసింది. తర్వాత సుధీర్ వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడించాడు. తర్వాత విశ్వా వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.."అరవడం అనేది ఒక అగ్రేషన్..దాని వలన హెల్త్ ఇస్స్యూస్ వస్తాయని మా అమ్మ భయం ఎందుకంటే ఒక్కోసారి ఆ అరవడం వలన, ఆ కోపం వల్ల చాలా దూరం వెళ్ళిపోతాం..మా అన్నయ్యను అలాగే మేము పోగొట్టుకున్నాం" అని విశ్వా చెప్పాడు. దాంతో సుధీర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఫైనల్ గా సుధీర్ వాళ్ళ పేరెంట్స్ పిక్ ని చూపించి "నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. కుదిరితే నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అని చెప్పాడు.
---------------
![]() |
![]() |